Amazon Pay | అమెజాన్ పే (ఇండియా)పై భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) సంచలన నిర్ణయం తీసుకున్నది. ప్రీపెయిడ్ పేమెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ (పీపీఐస్), నో యువర్ కస్టమర్ (కేవైసీ) నిబంధనల అమలులో విఫలమైనందుకు అమెజాన్ పే (ఇండియా)పై రూ.3.06 కోట్ల పెనాల్టీ విధిస్తూ శుక్రవారం ప్రకటించింది. కేవైసీ నిబంధనలను అమలు చేయడంలో విఫలమైనందున పెనాల్టీ విధిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
కేవైసీ నిబంధనలను అమలు చేయనందుకు మీపై ఎందుకు పెనాల్టీ విధించకూడదో తెలియజేయాలని కోరుతూ అమెజాన్ పే (ఇండియా)కు షోకాజ్ నోటీసు కూడా ఇచ్చామని ఆర్బీఐ వెల్లడించింది. అమెజాన్ పే (ఇండియా) సమాధానాన్ని పరిశీలించిన తర్వాతే.. నిబంధనలు, మార్గదర్శకాలను అమలు చేయడంలో విఫలమైనందుకు పెనాల్టీ విధిస్తున్నట్లు పేర్కొంది. రెగ్యులేటరీ నిబంధనలను అమలు చేయనందు వల్లే పెనాల్టీ విధిస్తున్నట్లు వివరించింది. ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్ డిజిటల్ పేమెంట్ సంస్థ అమెజాన్ పే (ఇండియా).