ముంబై, మార్చి 3: ఆన్లైన్ దిగ్గజం అమెజానకు చెందిన ‘అమెజాన్ పే’కు రిజర్వుబ్యాంక్ గట్టి షాకిచ్చింది. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రూమెంట్స్(పీపీఐఎస్), కేవైసీ నిబంధనలకు సంబంధించి పలు పాటించకపోవడంతో సెంట్రల్ బ్యాంక్ రూ.3.06 కోట్ల జరిమానా విధించింది.
ముఖ్యంగా కేవైసీ అవసరాలపై ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాలకు అమెజాన్ పే కట్టుబడి లేదని ఒక ప్రకటనలో రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. దీనిపై గతంలోనే అమెజాన్ పేకు షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ పట్టించుకోలేదని, దీంతో జరిమానా విధించాల్సి వచ్చిందని పేర్కొంది.