న్యూఢిల్లీ, జూన్ 20: అంతర్జాతీయ ప్రతికూల పరిణామాల కారణంగా దేశీ మార్కెట్ల నుంచి భారీ నిధులు తరలివెళ్లిపోతాయని అంచనా వేస్తున్నట్టు రిజర్వ్‌బ్యాంక్ రిపోర్ట్ వెల్లడించింది. ఏడాదికాలంలో 100 బిలియన్ డాలర్లను (రూ.7.8 లక్షల కోట్లు) విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) తరలించుకుపోతారని, ఇవి జీడీపీలో 3.2 శాతమని ఆర్బీఐ తాజా బులెటన్లో పేర్కొంది. అనూహ్య పరిణామాల కారణంగా దేశం నుంచి వెలుపలికి తరలే నిధుల ప్రవాహం జీడీపీలో 7.7 శాతానికి పెరగవచ్చని హెచ్చరించింది. అటువంటి అనిశ్చితిని ఎదుర్కోవడానికి తగిన విదేశీ మారక నిల్వల్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖల్ దేవబ్రత పాత్రా పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.1.98 లక్షల కోట్లను వెనక్కు తీసుకున్నారు.