RBI Repo Rate | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రకటన చేసింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో వడ్డీరేట్లను యథాతథంగా 5.5 శాతం వద్దే ఉంచింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ (RBI Governor) సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) బుధవారం వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న 5.5 శాతం రెపోరేటు కొనసాగుతుందని ప్రకటించారు.
2025లో ఇప్పటికే వడ్డీరేట్లపై ట్రిబుల్ బొనాంజా ప్రకటించిన ఆర్బీఐ, ఈసారి మాత్రం ఆచితూచి వ్యవహరించింది. ద్రవ్య విధానంలో ‘న్యూట్రల్’ వైఖరి కొనసాగుతుందని స్పష్టం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ వృద్ధి రేటు 6.5శాతంగా నమోదవ్వొచ్చని పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్లో కీలక వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన విషయం తెలిసిందే. జూన్ సమీక్షలో ఏకంగా 50 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది.
Also Read..
Gold rates | పసిడి ధర పరుగో.. పరుగు.. మళ్లీ పెరుగుతున్న బంగారం రేట్లు
కష్టాల్లో పౌల్ట్రీ పరిశ్రమ.. సమస్యల్లో పెంపకందారులు