న్యూఢిల్లీ, ఆగస్టు 5: చైనా బిలియనీర్ జాక్ మా సంస్థ యాంట్ ఫైనాన్షియల్.. మంగళవారం పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌కు గుడ్‌బై చెప్పింది. బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా తమకున్న మొత్తం 5.84 శాతం వాటా (3.73 కోట్ల ఈక్విటీ షేర్లు)ను రెండు విడుతల్లో రూ.3,980 కోట్లకు అమ్మేసుకున్నది.
దీంతో వన్97 షేర్ విలువ పతనమైంది. 2.38 శాతం దిగజారి బీఎస్ఈలో రూ.1,052.65 వద్ద నిలిచింది.