న్యూఢిల్లీ, ఆగస్టు 16: విదేశీ నిల్వలు క్రమంగా కరిగిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో మన కరెన్సీ బలహీనపడటంతో గతవారాంతం నాటికి విదేశీ మారకం నిల్వలు 9.3 బిలియన్ డాలర్లు తరిగిపోయాయని రిజర్వు బ్యాంక్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. దీంతో విదేశీ నిల్వలు 689 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.
అయినప్పటికీ దేశీయ 11 నెలల దిగుమతులకు సరిపడా విదేశీ నిల్వలు ఉన్నాయి. విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ తరిగిపోవడం ఇందుకు కారణమని తన వారాంతపు సమీక్షలో వెల్లడించింది. విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న విలువ 581.607 బిలియన్ డాలర్లకు తగ్గాయి. అలాగే గోల్డ్ రిజర్వులు 1.706 బిలియన్ డాలర్లు కరిగిపోయి 83.998 బిలియన్ డాలర్లకు పరిమితమం అయ్యాయి.