Rs.2000 Ban Effect | 2016 నవంబర్ 8.. రాత్రి 8 గంటలు.. ప్రధాని నరేంద్రమోదీ టీవీ ముందుకు వచ్చి జాతినుద్దేశించి ప్రసంగించారు. నాటి అర్ధరాత్రి 12 గంటల నుంచి రూ.1000, రూ.500 విలువైన పాత పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన చేసిన ప్రకటనతో ఒక్కసారిగా 86 శాతం కరెన్సీ రూ.15.44 లక్షల కోట్ల కరెన్సీ నోట్లు చిత్తు కాగితాల్లా మారిపోయాయి.
పాత పెద్దనోట్ల రద్దుతో అకస్మాత్తుగా కరెన్సీ అవసరాలు పెరిగాయి. 1934 ఆర్బీఐ చట్టం 24 (1) సెక్షన్ ప్రకారం రూ.2000 విలువైన నోట్ల ముద్రణ ప్రారంభించింది. ఈ నిర్ణయం నాడు కరెన్సీ కొరతను పరిష్కరించింది. కానీ ఇప్పుడు కొత్త సమస్య పుట్టుకొచ్చింది. దాదాపు ఆరేండ్ల తర్వాత 2023 మే 19న ఆర్బీఐ.. రూ.2,000 విలువైన నోటు చలామణి నుంచి విత్ డ్రా చేస్తున్నట్లు ప్రకటించడం అతిపెద్ద తప్పిదం అని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
నాడు ప్రధాని నరేంద్రమోదీ 2016లో నల్లధనాన్ని వెలికి తీసేందుకు పాతపెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వాస్తవంగా నల్లధనం ఎల్లవేళలా క్యాష్, నోట్ల రూపంలో ఉండదు. అది బంగారం, వెండి, భూములు, విలువైన వస్తువుల రూపంలో ఉండదు. పన్ను చెల్లించని ఆదాయమే నల్లధనం.
అవినీతి అధికారులైనా, అక్రమ వ్యాపార వేత్తను తీసుకుంటే.. అవినీతి అధికారి క్యాష్ రూపంలో తీసుకున్న ముడుపులు.. బంగారంగా మార్చేస్తారు. అక్రమ లావాదేవీలతో వ్యాపారాలు చేసే వ్యాపారవేత్తలు.. తాను సంపాదించే ఆదాయంపై పూర్తి పన్ను చెల్లించరు. తక్కువ లాభాలు చూపుతారు. తన ఖాతాలో ఎక్కువ మొత్తంలో నగదు నిల్వలు ఉన్నా.. నకిలీ బిల్లుల ద్వారా ఎక్కువ ఖర్చు చూపే పత్రాలు సమర్పిస్తారు.
అవినీతి అధికారి అయినా, అక్రమ వ్యాపార లావాదేవీలు నిర్వహించే వారైనా నగదు రూపంలో తమ వద్ద నిల్వ పెట్టుకుంటారా? అంటే అనుమానమేనంటున్నారు ఆర్థిక వేత్తలు. లెక్కలు చూపకుండానే బంగారం లేదా ఆస్తి, భూమి కొనుగోళ్లలోకి బ్లాక్ మనీ మళ్లిస్తుంటారన్న ఆరోపణలు ఉన్నాయి.
క్లీన్ నోట్ల రూపంలో నల్లధనాన్ని వెలికి తీయడం ఈజీ.. హై డినామినేషన్ నోట్లతో చాలా ఈజీ.. అలాగే వాటిని నిల్వ చేయడమూ దాచి పెట్టడమూ.. ప్రభుత్వ నిఘా సంస్థల కన్నుగప్పి లావాదేవీలు జరుపడమూ తేలికనంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా నల్లధనాన్ని నిలువరించడానికి పాత పెద్దనోట్లు రద్దు చేశామని నాడు 2016లో కేంద్రం ప్రకటించింది. ప్రజల్లో అసౌకర్యాన్ని నిలువరించేందుకు పాత పెద్దనోటు రూ.1000కి రెట్టింపు విలువ గల రూ.2000 విలువైన నోట్లు ముద్రించింది. దేశ నలుమూలలకు విమానాల్లో కేంద్రం తరలించింది.
రూ.2000 విలువైన నోట్ల ముద్రణతో నల్లధనం నిల్వలను ప్రోత్సహించేందుకు అన్న ఆరోపణలు ఉన్నాయి. పెద్ద నోట్లను ఖర్చు చేయడానికి బదులు దాచి పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. భారత్ వంటి దేశాల్లో కష్టపడి సంపాదించే వారు అలా వచ్చిన ఆదాయం కర్చు చేస్తారు. భారతదేశంలో అత్యధిక జనాభా పెద్ద నోట్లను ఖర్చు చేయగల పరిస్థితుల్లో లేరు.
ఆర్బీఐ డేటా మరోమారు బయట పడింది. 5,10,20,50,100 విలువైన రూపాయల నోట్లు ఏటా 33 శాతం పెద్వ తింటాయి. రూ.500 నోట్లు 22 శాతం, నాటి పెద్ద నోటు రూ.1000.. 11 శాతం దెబ్బ తింటాయి. దాచిపెట్టే బ్లాక్ మనీతో పోలిస్తే దెబ్బ తినే నోట్ల శాతం చాలా తక్కువ. చిన్న విలువ గల నోట్లతో మాత్రమే నిజమైన లావాదేవీలు జరుగుతాయి. ఆర్బీఐ డేటా ప్రకారం 2016కి ముందు 7.3 లక్షల నోట్లు బ్లాక్ మనీగా మార్చేశారు.