ముంబై : క్రిప్టోకరెన్సీలతో ఆర్ధిక వ్యవస్ధలకు ముప్పని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఆందోళన వ్యక్తం చేశారు. క్రిప్టోకరెన్సీలకు నియంత్రిత వ్యవస్ధ ఏర్పాటు చేసే వరకూ ఇవి దేశ ఆర్ధిక స్ధిరత్వానికి సవాల్ విసురుతాయని వ్యాఖ్యానించారు. భారత్‌లో క్రిప్టోకరెన్సీ మదుపుదారుల సంఖ్య..మార్కెట్ విలువపై ఆయన సందేహం వ్యక్తం చేశారు.
వర్చువల్ కరెన్సీలపై ప్రభుత్వం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటుందని అయితే కేంద్ర బ్యాంకర్‌గా క్రిప్టోకరెన్సీలపై తాము తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. భారత్‌లో 10 కోట్ల మంది క్రిప్టోకరెన్సీ కలిగిఉన్నారని ఇటీవల ఓ నివేదిక వెల్లడించిన నేపధ్యంలో క్రిప్టోకరెన్సీ ఇన్వెస్టర్ల సంఖ్యపైనా శక్తికాంతదాస్ సందేహం వ్యక్తం చేయడం గమనార్హం.