ముంబై, డిసెంబర్ 9: వడ్డీరేట్లను తగ్గించాలని ప్రభుత్వరంగ బ్యాంకులతోపాటు ప్రైవేట్ బ్యాంకులకు రిజర్వు బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సూచించారు. మంగళవారం ప్రభుత్వరంగ బ్యాంకుల ఎండీ, సీఈవోలతోపాటు పలు ప్రైవేట్ బ్యాంక్‌ల బాస్‌లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
వడ్డీరేట్లను తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గించి వృద్ధికి ఊతమివ్వాలని సూచించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను 125 బేసిస్ పాయింట్లు దించి రెపోరేటును 5.25 శాతానికి దించిన విషయం తెలిసిందే.