Shakti Kanta Das | ఇండ్ల రుణాలపై వడ్డీరేట్లు ఇప్పట్లో తగ్గవ్.. తేల్చేసిన శక్తికాంత దాస్
Shakti Kanta Das | పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇండ్ల రుణాలపై వడ్డీరేట్లు ఇప్పట్లో తగ్గవన్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్.
Shakti Kanta Das | ఇండ్ల రుణాలు మొదలు కారు లోన్లు, పర్సనల్ లోన్లపై మరికొంత కాలం వడ్డీరేట్లు పెరుగుతాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తేల్చి చెప్పారు. వివిధ రుణాలపై తక్షణం రిలీఫ్ లభించకపోవచ్చునని ఇటీవలే ఆయన సంకేతాలిచ్చారు. ఒకవేళ ఉక్రెయిన్-రష్యా యుద్ధం మరికొంత కాలం కొనసాగితే సుదీర్ఘ కాలం వివిధ రుణాలపై వడ్డీరేట్లు ఎక్కువగానే ఉంటాయని స్పష్టం చేశారు. వస్తువుల సరఫరాలో సమస్యలు పరిష్కారమై, పరిస్థితులు చక్కబడితే ద్రవ్యోల్బణం తగ్గి వస్తుందన్నారు.
`ఫిబ్రవరిలో జరిగే ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయాలకు ఇది సంకేతం కాదు. ఒకవేళ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అంటే ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగితే మాత్రం సుదీర్ఘ కాలం వడ్డీరేట్లు ఎక్కువగానే ఉంటాయి. ఇది కేవలం అమెరికాకు మాత్రమే పరిమితం కాదు. యావత్ ప్రపంచం అంతటా ఇలాగే ఉంటుంది` అని శనివారం ఓ ఇంటర్వ్యూలో శక్తికాంత దాస్ చెప్పారు.
అంతర్జాతీయంగా వస్తువుల సరఫరాలో సమస్యలు తగ్గితే ద్రవ్యోల్బణం దిగి వస్తుందన్నారు శక్తికాంత దాస్. నిరంతరం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగినా.. కొత్త పరిస్థితులకు అలవాటు కావడం మానవ సమాజానికి తెలుసునన్నారు. ద్రవ్యోల్బణం నియంత్రణకు కొత్త మార్గాలు సిద్ధం అవుతున్నాయన్నారు.
ఆరు నెలల క్రితం అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఉన్నాయని ప్రతి ఒక్కరూ భావించారని శక్తికాంత దాస్ చెప్పారు. ఆర్థిక మందగమనం ఇంతకుముందుతో పోలిస్తే నెమ్మదించొచ్చునని అన్నారు. అనిశ్చిత పరిస్థితులు ఇలాగే కొనసాగితే అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాల్సి ఉంటుందన్నారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తేవడానికి ఇంకా ఏడెనిమిది నెలలు పడుతుందని ఆయన తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఢిల్లీలో నిరసనలు.. తెలంగాణలో కేసులా?
మంటగలిసిన పేగుబంధం.. ఆరేండ్ల చిన్నారి కూతురును హుస్సేన్‌సాగర్‌లోకి విసిరిన మహిళ
ఓటర్ల మొగ్గు.. బీఆర్ఎస్ వైపు.. చాణక్య స్ట్రాటజీస్ ఎండీ ముకేశ్
వారంలోగా భూసేకరణ చేసి పరిహారమివ్వండి.. అమలుచేయకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవు
ముగిసిన స్పీకర్ ప్రసాద్‌కుమార్ బృందం యూరప్ పర్యటన
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

