Indian Rupee |ముంబై, సెప్టెంబర్ 19: కొద్ది నెలలుగా ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయి సమీపానికి తగ్గినప్పుడల్లా కోలుకుంటూవచ్చిన రూపాయి.. తాజాగా రికార్డు స్థాయిలో పతనమయ్యింది. గత ఏడాది అక్టోబర్‌లో నమోదైన 83.29 స్థాయిని వదులుకుని మరింత దిగువకు జారిపోయింది. సోమవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో డాలర్ మారకంలో 83.09 వద్ద ప్రారంభమైన భారత కరెన్సీ.. క్రమేపీ క్షీణించి 83.32 వద్దకు పడిపోయింది. అంతక్రితం ట్రేడింగ్ రోజుతో పోలిస్తే 16 పైసలు తగ్గింది. శుక్రవారం కూడా 13 పైసలు నష్టపోయింది. దీంతో వరుసగా రెండు రోజుల్లో 29 పైసల నష్టాన్ని చవిచూసినైట్టెంది. రిజర్వ్ బ్యాంక్, ప్రభుత్వ బ్యాంక్‌ల సాయంతో డాలర్లను విక్రయించి, రూపాయికి మద్దతు ఇచ్చినప్పటికీ రుపీ నిలువలేదని ఫారెక్స్ ట్రేడర్లు చెప్పారు. కాగా, వినాయక చవితి సందర్భంగా మంగళవారం ముంబైలోని ఫారెక్స్ మార్కెట్‌కు సెలవు. క్షీణతకు ఫారెక్స్ ట్రేడర్లు చెప్తున్న కారణాలివి..