ముంబై, జనవరి 6: వివిధ దేశాల్లోని కేంద్రబ్యాంకులు వ్యూహాత్మకంగా పసిడి నిల్వలను పెంచుకుంటున్నాయి. గతేడాది నవంబర్ నెలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్‌లు 53 టన్నుల గోల్డ్‌ను కొనుగోలు చేశాయి. దీంట్లో రిజర్వుబ్యాంక్ 8 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజాగా వెల్లడించింది. యుద్ధాలు, అధిక ద్రవ్యోల్బణం, ఇతర సవాళ్లను అధిగమించడానికి ఆయా సెంట్రల్ బ్యాంకులను పసిడి నిల్వలను పెంచుకోవడానికి అధికప్రాధాన్యతనిస్తున్నాయి.