RBI | ముంబై, మే 5 : రిజర్వుబ్యాంక్ మరో 25 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో 25 టన్నుల గోల్డ్ రిజర్వులను పెంచుకున్నది. దీంతో సెంట్రల్ బ్యాంక్ వద్ద బంగారం నిల్వలు 879.59 టన్నులకు చేరుకున్నాయి. సెప్టెంబర్ 2024 నాటికి 854.73 టన్నుల గోల్డ్ నిల్వలు ఉండగా..ప్రస్తుతం 57 టన్నులను పెంచుకున్నది.
గడిచిన ఏడేండ్లలో ఒకే ఏడాది ఇంతటి స్థాయిలో కొనుగోలు చేయడం ఇదే తొలిసారి. ఒకవైపు పసిడి ధరలు రికార్డు స్థాయి లో పెరిగినప్పటికీ ఆర్బీఐ గోల్డ్‌ను కొనుగోలు చేయడం విశేషం. సెంట్రల్ బ్యాంక్ వద్ద ఉన్న బంగారం నిల్వల్లో 511.99 టన్నుల గోల్డ్‌ను స్థానికంగా నిల్వ చేయగా, మరో 348.62 టన్నులను బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్(బీఐఎస్) వద్ద, డిపాజిట్ రూపంలో 18.98 టన్నులు ఉంచింది.