కరీంనగర్, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్‌గా ఎనలేని సేవలు అందించి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కొండూరు రవీందర్‌రావుకు మరో అరుదైన గౌరవం దక్కింది. నాబార్డ్ ఆధ్వర్యంలో నిర్వహించే లక్నోలోని బీఐఆర్‌డీ పాలక మండలి సభ్యుడిగా శుక్రవారం మూడోసారి నామినేట్ అయ్యారు.
2028 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. 2021లో బీఐఆర్‌డీ లక్నో 50వ పాలక మండలి సభ్యుడిగా మొదటిసారి నియమితులయ్యారు. తాజాగా జరిగిన 59వ పాలక మండలి సమావేశంలోనూ మరోసారి నామినేట్ అయ్యారు. కరీంనగర్ డీసీసీబీ చైర్మన్‌గా సేవలు అందించిన కాలంలో రవీందర్రావు బ్యాంక్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దారు. దేశంలోనే అత్యుత్తమ బ్యాంక్‌గా గుర్తింపు తెచ్చారు.