Growth Rate | న్యూఢిల్లీ, జనవరి 29: ఈ ఏడాది దేశ జీడీపీ వృద్ధిరేటు 6.4 శాతాన్ని అందుకోవాలంటే భారత ఆర్థిక, ద్రవ్య విధానాలు మారాల్సిన అవసరం ఉన్నదని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అభిప్రాయపడింది.
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం, దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి భారీగా తరలిపోతున్న విదేశీ సంస్థాగత మదుపరుల (ఎఫ్ఐఐ) పెట్టుబడుల నడుమ ఇది ఎంతో ముఖ్యమని బుధవారం మూడీస్ అనలిటిక్స్ పేర్కొన్నది. కాగా, రాబోయే బడ్జెట్లో దేశీయ వినిమయ సామర్థ్యం పెంపునకు దోహదపడే నిర్ణయాలుంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.