న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19 : రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరో ఆర్డర్‌ను దక్కించుకున్నది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సైప్లె అండ్ సీవరేజ్ బోర్డ్(హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ) నుంచి రూ. 2,085 కోట్ల విలువైన ఆర్డర్ లభించింది.
ఈ కాంట్రాక్టులో భాగంగా గోదావరి డ్రింకింగ్ వాటర్ సైప్లె స్కీం-ఫేజ్ 2, ఫేజ్3, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ రిజర్వులను గోదావరి నీటితో నింపాల్సివుంటుంది. వచ్చే రెండేండ్లలో ఈ కాంట్రాక్టునకు సంబంధించి పూర్తి చేయాల్సివుంటుంది.