న్యూఢిల్లీ, జూన్ 18: పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం.. భారతీయ కంపెనీల లాభాలపై పడే వీలున్నదని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తున్నది. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను కార్పొరేట్ సంస్థలు త్వరలో విడుదల చేయబోయే ఆర్థిక ఫలితాలు నిరాశపర్చవచ్చని గురువారం అభిప్రాయపడింది. నిర్వహణ లాభం మార్జిన్ 100-150 బేసిస్ పాయింట్లు తగ్గవచ్చన్నది. అలాగే ఎల్నినో పరిస్థితులు.. గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారుల కొనుగోలు సామర్థ్యాన్ని ప్రభావితం చేయవచ్చని హెచ్చరించింది. దీంతో మెజారిటీ కార్పొరేట్ కంపెనీల ఆదాయం పడిపోయే అవకాశాలున్నాయన్నది.