హైదరాబాద్, అక్టోబర్ 24: ప్యూర్ ఈవీ.. దీపావళి పండుగను దృష్టిలోపెట్టుకొని ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన సరికొత్త మోటర్‌సైకిళ్లపై రూ.20 వేల వరకు తగ్గింపు ధరకు విక్రయిస్తున్నది. వచ్చే నెల 10 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్లతో ఈ బైకుల ప్రారంభ ధర రూ.99,999కి తగ్గనున్నది.
అడ్వాన్స్ ఫీచర్లతో రూపొందించిన ఎకోడ్రైఫిట్, ఈట్రైస్ట్ ఎక్స్‌లో క్లౌడ్ అలర్ట్, స్మార్ట్ బ్యాటరీ మేనేజ్మెంట్, సింగిల్ చార్జింగ్‌తో 171 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. ఈ సందర్భంగా కంపెనీ ఫౌండర్, ఎండీ నిశాంత్ దొంగారి మాట్లాడుతూ..కాలుష్యాన్ని తగ్గించడానికి అధిక ప్రాధాన్యతనివ్వడంలో భాగంగా ఈవీల కొనుగోళ్లను ప్రోత్సహించడానికి ఈ ఆఫర్లను తీసుకొచ్చినట్లు చెప్పారు.