ముంబై, జనవరి 28 : హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న ప్యూర్ ఈవీ..ఫ్రెంచ్నకు చెందిన బీఈ ఎనర్జీతో జట్టుకట్టింది. అడ్వాన్స్డ్ లిథియం-అయాన్ బ్యాటరీ టెక్నాలజీని అందుబాటులోకి తేవడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్యూర్ ఈవీ వర్గాలు వెల్లడించాయి. దీర్ఘకాలికంగా ఈవీ కార్ల యజమానులకు అయ్యే ఖర్చును తగ్గించడానికి, ముఖ్యంగా నూతన బ్యాటరీ కొనుగోలుకు అయ్యే ఖర్చును తగ్గించడానికి వీలు పడనున్నదని వెల్లడించింది.
ప్యూర్ ఈవీతో కుదుర్చుకున్న ఒప్పందంతో బీఈ ఎనర్జీ దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టినట్లు అయింది. ఇరు సంస్థల భాగస్వామ్యంలో భాగంగా హైదరాబాద్లోని కర్మన్ఘాట్ ఐడీఏ వద్ద ఏర్పాటు చేస్తున్న యూనిట్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోకి రానున్నట్లు ప్యూర్ ఈవీ ఎండీ, ఫౌండర్ నిశాంత్ దొంగరి తెలిపారు.