PNB Fraud | పీఎన్బీలో మరో స్కాం.. మొండి బాకీగా రూ.2060 కోట్ల రుణం!
PNB Fraud | పీఎన్బీలో మరో ఫ్రాడ్ బయటపడింది. ఐఎల్&ఎఫ్ఎస్ తమిళనాడు పవర్ కంపెనీ రూ.2060 కోట్లకు రుణం ఎగవేసింది.
PNB Fraud | నీరవ్ మోదీ-మెహుల్ చౌక్సీ స్కాం తర్వాత ఐదేండ్లకు కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) లో మరో ఫ్రాడ్ బయటపడింది. ఐఎల్&ఎఫ్ఎస్ ద్వారా తమిళనాడు పవర్ కంపెనీ తీసుకున్న రూ.2,060.14 కోట్ల రుణం మొండి బకాయిగా మారింది. ఇది లార్జ్ కార్పొరేట్ బ్యాంక్ ఢిల్లీ శాఖలో వెలుగు చూసింది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గైడ్‌లైన్స్ ప్రకారం మంగళవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. పంజాబ్ & సింధ్ బ్యాంక్ తర్వాత ఐఎల్&ఎఫ్ఎస్ తమిళనాడు పవర్ కంపెనీ రుణాలను మొండి బకాయిగా ప్రకటించిన బ్యాంక్‌గా.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిలిచింది.
2018లో పలు సంస్థలకు నిధులు సమకూర్చిన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) .. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ (ఐఎల్&ఎఫ్ఎస్).. డిఫాల్ట్ ఆరోపణలు ఎదుర్కొన్నది. ఐఎల్&ఎఫ్ఎస్ రుణాలు రూ.94 వేలకోట్లని అప్పట్లో అంచనా వేశారు.
డిఫాల్ట్ సంక్షోభం నుంచి ఐఎల్&ఎఫ్ఎస్ బయటపడవేసేందుకు కేంద్రం 2018 అక్టోబర్‌లో పాత బోర్డును రద్దు చేసి.. కొత్త బోర్డును ఏర్పాటు చేసింది. కొటక్ మహీంద్రా బ్యాంకుకు చెందిన ఉదయ్ కొటక్, టెక్ మహీంద్రా ప్రతినిధి వినీత్ నయ్యర్, సెబీ మాజీ చీఫ్ జీఎన్ బాజ్‌పాయ్, ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చైర్మన్ జీసీ చతుర్వేది, మాజీ ఐఏఎస్ అధికారులు మాలినీ శంకర్, నంద్ కిశోర్‌లతో కొత్త కమిటీని నియమించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

