ముంబై : అతడు టెకీ కాదు..ఇంజనీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ లేనేలేదు..అయినా పట్టుబట్టి కోడింగ్ స్కిల్స్‌ను వంటబట్టించుకుని గూగుల్‌లో (Google Offer) రూ. 50 లక్షల వార్షిక వేతనంతో కొలువును సంపాదించాడు. పుణేకు చెందిన సాధారణ డిగ్రీ విద్యార్ధి హర్షల్ జుకర్ ఈ అరుదైన ఘనత సాధించాడు. ముంబైలో పుట్టి పెరిగిన జుకర్ ఇంజనీరింగేతర డిగ్రీ పూర్తిచేశాడు.
అయితే ఇంజనీరింగ్ విద్యార్హతలు లేవని నిరాశ చెందని జుకర్ కంప్యూటర్ కోడింగ్, ప్రోగ్రామింగ్‌లో ప్రావీణ్యం సంపాదించాడు. తన నైపుణ్యాలకు నిరంతరం పదునుపెట్టుకుంటూ గూగుల్ కంటపడ్డాడు. జుకర్ కోడింగ్ టాలెంట్‌ను పసిగట్టిన గూగుల్ అతడిలో అత్యున్నత నైపుణ్యాలున్నాయని గమనించి మంచి వేతన ప్యాకేజ్‌తో జాబ్ ఆఫర్ చేసింది.
ఇక ఐఐఐటీ అలహాబాద్‌కు చెందిన అనురాగ్ మకడే మరో సక్సెస్ స్టోరీతో ముందుకొచ్చాడు. టెక్ స్టూడెంట్ అయిన అనురాగ్ మకడే అమెజాన్‌లో రూ. 1.25 కోట్ల వార్షిక వేతనంతో కొలువు సాధించాడు. ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో అమెజాన్ ఫ్రంటెండ్ ఇంజనీర్‌గా అనురాగ్ మకడేకు జాబ్ ఆఫర్ లభించింది.
Read More :