న్యూఢిల్లీ, జూన్ 13: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్‌కు చెందిన పంచ్.ఈవీ, నెక్సాన్.ఈవీలకు భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రొగ్రాం(భారత్-ఎన్సీఏపీ) 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది. దేశీయ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఈ రెండు కార్లు అత్యంత సురక్షితమైనవని, అందుకోసం టాటా మోటర్స్‌ను అభినందిస్తున్నానని ఎక్స్‌లో కేంద్ర రోడ్డు, రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.