Provident Fund | ఉద్యోగం మారితే.. పాత పీఎఫ్ విత్‌డ్రా నాట్గుడ్.. ఎందుకంటే?!
Provident Fund | ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు సంస్థ మారినప్పుడు పాత పీఎఫ్ ఖాతా మొత్తం విత్‌డ్రా చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు.

Provident Fund | ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు ప్రతి రెండు,మూడేండ్లకు ఒకసారి ఉద్యోగం మారడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. ఉద్యోగం మారగానే.. మాజీ సంస్థ పీఎఫ్ ఖాతా నుంచి మొత్తం మనీ విత్‌డ్రా చేయడం నష్టమేనని నిపుణులు చెబుతున్నారు. మీరు మాజీ సంస్థ పీఎఫ్ ఖాతా నుంచి నగదు విత్‌డ్రా చేస్తే.. మీ భవిష్యత్ అవసరాల కోసం భారీ మొత్తంలో నిధి, సేవింగ్స్ క్రియేట్ చేసుకునే అవకాశాన్ని కోల్పోయినట్లే.
కొత్త సంస్థ ఖాతాలో పాత పీఎఫ్ ఖాతా విలీనం బెస్ట్
అంతేకాదు.. మాజీ సంస్థలో పీఎఫ్ ఖాతా నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవడం అంటూ జరిగితే పెన్షన్ కంటిన్యూటీ కూడా ఉండదు. కనుక కొత్త కంపెనీలో చేరినప్పుడు.. పాత సంస్థ పీఎఫ్ ఖాతాను కొత్త సంస్థ ఖాతాలో విలీనం చేయడం మెరుగని అభిప్రాయ పడుతున్నారు. మీ రిటైర్మెంట్ తర్వాత కూడా మీకు వెంటనే డబ్బు అవసరం లేకపోతే కొన్నేండ్ల పాటు పీఎఫ్ అలాగే వదిలేయాలని సూచిస్తున్నారు నిపుణులు.
రిటైరైనా తర్వాత మూడేండ్ల వరకు వడ్డీ
పాత సంస్థలో ఉద్యోగం మానేసి, కొత్త సంస్థలో చేరిన తర్వాత ఆ సంస్థ ఖాతాలోకి పీఎఫ్‌ను బదిలీ చేసుకుంటే వడ్డీ కూడా బదిలీ అవుతుంది. ఒకవేళ రిటైర్మెంట్ తర్వాత కూడా ఉద్యోగులు డబ్బు విత్‌డ్రా చేసుకోకపోతే మూడేండ్ల వరకు వడ్డీ వస్తుంది. మూడేండ్ల తర్వాత దాన్ని డార్మెంట్ ఖాతాగా మాత్రమే పరిగణిస్తారు.
అలాగైతే సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్‌కు బదిలీ..
చాలా మంది పీఎఫ్ మొత్తాన్ని సురక్షిత నిధిగా భావిస్తారు. అలాగే ఉంచేస్తారు. కానీ ఆదాయం పన్ను చట్టం నిబంధనల ప్రకారం కంట్రిబ్యూషన్ లేకున్నా.. ఆ ఖాతాను డీయాక్టివేట్ చేయరు. కానీ ఆ టైంలో వచ్చే వడ్డీపై పన్ను విధిస్తారు. ఒకవేళ పీఎఫ్ అకౌంట్ ఇన్‌యాక్టివ్ అయితే, ఆ తర్వాత సదరు పీఎఫ్ ఖాతాలోని సొమ్ము సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్ (ఎస్‌సీడబ్ల్యూఎఫ్)కు వెళుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Hyderabad | ఆఫీస్ స్పేస్‌లో హైదరాబాద్ అగ్రస్థానం
Bullet Doctor : బుల్లెట్ బండి డాక్టర్.. ఈయన స్పెషాలిటీ ఏంటో తెలుసా?
మ్యాట్రిమోనియల్ సైట్లో పరిచయమైన మహిళపై కన్నేసి ఆపై లైంగిక దాడి!
నంబర్ 16 నుంచి ‘ఇండియాజాయ్’.. తెలంగాణ ప్రభుత్వం మద్దతు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

