RC 17 | రామ్ చరణ్‌తో సుకుమార్ మరో ప్రయోగం.. రంగస్థలం తర్వాత ఊహించని సబ్జెక్ట్‌తో మెగా పవర్ స్టార్!
RC 17 | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకోవడమే కాకుండా రామ్ చరణ్ కెరీర్లోనే ప్రత్యేక చిత్రంగా నిలిచిపోయింది.
RC 17 | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకోవడమే కాకుండా రామ్ చరణ్ కెరీర్లోనే ప్రత్యేక చిత్రంగా నిలిచిపోయింది. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ముహూర్త కార్యక్రమాలు నిర్వహించడంతో అభిమానుల్లో ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది.అయితే ఈసారి సుకుమార్ ఎంచుకున్న కథాంశం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటివరకు ఆయన సినిమాలంటే విభిన్నమైన కథలు, బలమైన పాత్రలు, కొత్త తరహా కథనాలు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా ‘రంగస్థలం’, ‘పుష్ప’ వంటి చిత్రాలతో తనదైన ముద్ర వేసిన సుకుమార్.. ఇప్పుడు రామ్ చరణ్‌తో కలిసి భక్తిరస నేపథ్యాన్ని ఎంచుకోవడం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
ఈ సినిమా ప్రకటనకు ముందు రామ్ చరణ్ కొత్త లుక్ చూసి అభిమానులు రకరకాల అంచనాలు వేసుకున్నారు. ముఖ్యంగా ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్‌ను బట్టి సుకుమార్ మరోసారి పీరియాడిక్ కథను తెరకెక్కిస్తారని కొందరు భావించారు. మరికొందరైతే గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందించబోతున్నారని అనుకున్నారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సుకుమార్ డివోషనల్ సబ్జెక్ట్‌ను తెరపైకి తీసుకొస్తున్నట్లు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. కమర్షియల్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ దర్శకుడు.. ఇప్పుడు ఆధ్యాత్మిక అంశాలను తనదైన శైలిలో ఎలా చూపించబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది.
రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 1980ల గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో చరణ్ నటనకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా చిట్టిబాబు పాత్రలో ఆయన చూపించిన నటనా ప్రతిభ కెరీర్లోనే మైలురాయిగా నిలిచింది. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరూ కలిసి పనిచేస్తుండటంతో అభిమానులు అదే స్థాయి మ్యాజిక్‌ను ఆశిస్తున్నారు. అయితే ఈసారి కథా నేపథ్యం పూర్తిగా భిన్నంగా ఉండటంతో సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి మరింత పెరిగింది. సాధారణంగా భక్తిరస చిత్రాల్లో ఆధ్యాత్మిక అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కానీ సుకుమార్ తన సినిమాల్లో భావోద్వేగాలు, పాత్రలు , ఆసక్తికరమైన మలుపులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. అలాంటి దర్శకుడు డివోషనల్ సబ్జెక్టును ఎంచుకోవడంతో ఈ కథను కొత్త కోణంలో చూపించే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- devotional
- ram charan
- RC 17
- sukumar
RELATED ARTICLES
తాజా వార్తలు
RC 17 | రామ్ చరణ్‌తో సుకుమార్ మరో ప్రయోగం.. రంగస్థలం తర్వాత ఊహించని సబ్జెక్ట్‌తో మెగా పవర్ స్టార్!
Manipur: మణిపూర్‌లో వర్గపోరు.. ముగ్గురు నాగా మిలిటెంట్లు హతం
Khammam | ఖమ్మంలో తీవ్ర విషాదం.. మత్స్యకారుల ప్రాణాలు కాపాడి వరదలో కొట్టుకుపోయిన 11 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది !
Ramayana | తెలుగు రాష్ట్రాల్లో ‘రామాయణ’ బిజినెస్ రూ.54 కోట్లు.. బ్రేక్ ఈవెన్ రూ.100 కోట్ల గ్రాస్ ,ఇది సాధ్యమేనా?
Suriya | సూర్యతో ఆ మూడు సినిమాలు మిస్ కావడానికి కారణం అదే.. అసలు విషయం బయటపెట్టిన నజ్రియా!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

