న్యూఢిల్లీ, అక్టోబర్ 22: ఇన్ఫోసిస్ రూ.18 వేల కోట్ల విలువైన షేర్ల తిరిగి కొనుగోలు ప్రక్రియకు దూరంగా ఉండనున్నట్టు కంపెనీ ప్రమోటర్లు ప్రకటించారు. వీరిలో నందన్ ఎం నీలేఖని, సుధామూర్తితోపాటు ప్రమోటర్లు ఉన్నారు. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లు 13.05 శాతం వాటా కలిగివున్నారు. ఈ బైబ్యాక్ పూర్తైన తర్వాత 13.05 శాతం వాటా కలిగిన ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూపునకు ఓటింగ్ తగ్గనున్నదని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ప్రమోటర్లలో కంపెనీ కో-ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తి, ఆయన భార్య సుధా ఎన్ మూర్తి, ఆయన కుమార్తే అక్షత మూర్తి, కుమారుడు రోహన్ మూర్తిలతోపాటు నందన్ నీలేఖనిలు ఉన్నారు. రూ.18 వేల కోట్ల బైబ్యాక్‌ను కంపెనీ బోర్డు గత నెలలో అనుమతినిచ్చిన విషయం తెలిసిందే.