హైదరాబాద్, అక్టోబర్ 17: హైదరాబాద్కు సమీపంలోని పటాన్చెరు వద్ద ఏర్పాటు చేసిన ఎయిర్ సపరేషన్ యూనిట్ (ఏఎస్యూ)లో ఉత్పత్తిని ప్రారంభించినట్టు ప్రాక్సెయిర్ ఇండియా లిమిటెడ్ (లిండే) ప్రకటించింది.
ఈ ప్లాంట్లో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్, నైట్రోజన్, ఆర్గాన్సహా రోజుకు మొత్తం 250 టన్నుల వాయువులు ఉత్పత్తి అవుతు న్నాయి. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు 2022లో లిండే సంస్థ.. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఏడాదిన్నరలోగా ప్లాంట్లో ఉత్పత్తిని ప్రారంభించడం విశేషమని లిండే-ఇండియా విక్రయ హెడ్ ఆర్సీ కౌశిక్ తెలిపారు.