హైదరాబాద్, జూలై 7: టెక్నాలజీ ఆధారిత హెల్త్‌కేర్ సేవలు అందిస్తున్న కార్కినోస్తో హైదరాబాద్‌కు చెందిన ప్రణామ్ హాస్పిటల్స్ జట్టుకట్టింది. ఈ ఒప్పందంలో భాగంగా క్యాన్సర్ వ్యాధిని గుర్తించే నూతన టెక్నాలజీ సెంటర్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పింది.
ఈ సందర్భంగా ప్రణామ్ హాస్పిటల్స్ ఎండీ మనీష్ గౌర్ మాట్లాడుతూ..ప్రణామ్ హాస్పిటల్స్..కార్కినోస్ హెల్త్‌కేర్‌తో చేతులు కలపడం సంతోషంగా ఉన్నదని, క్యాన్సర్ నిర్మూలనలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఈ భాగస్వామ్యం కీలకంగా నిలువనున్నదన్నారు.