హైదరాబాద్, అక్టోబర్ 15 : పవర్ మెక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ మరో భారీ ఆర్డర్‌ను చేజిక్కించుకున్నది. విద్యుత్ పరికరాల తయారీ సంస్థ భెల్ నుంచి రూ.2,500 కోట్ల విలువైన ఆర్డర్ లభించినట్టు సంస్థ వెల్లడించింది.
మంచిర్యాల జిల్లాలో జైపూర్ వద్ద సింగరేణి నిర్మించతలపెట్టిన 2 వేల మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌నకు సంబంధించి ఈ ఆర్డర్ పొందినట్టు కంపెనీ సీఎండీ సజ్జ కిశోర్ తెలిపారు.