Porsche | జర్మనీ కార్ల తయారీ సంస్థ పొర్చె (Porsche) భారత్ మార్కెట్లో తన 911 ఎస్/టీ సూపర్ కారు ఆవిష్కరించింది. కేవలం 3.7 సెకన్లలో 100 కి.మీ వేగంతో దూసుకెళుతుంది. గరిష్టంగా గంటకు 300 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. లంబోర్ఘిని హురకేన్ ఇవో (Lamborghini Huracan EVO) కారుతో పోటీ పడుతుంది. న్యూ పొర్చె 911 ఎస్/టీ సూపర్ కారు (Porsche 911 S/T supercar) ధర రూ.4.26 కోట్లు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించారు. భారత్ మార్కెట్లో పొర్చె కార్లలో అత్యంత ఖర్చుతో కూడుకున్న కారు ఇదే. కేవలం 1963 కార్లు మాత్రమే విక్రయిస్తారు.
పొర్చె 60వ వార్షికోత్సవం సందర్భంగా లిమిటెడ్ ఎడిషన్‌గా కార్ల ప్రేమీకులకు అందుబాటులోకి వస్తున్నది పొర్చె 911 ఎస్/టీ. జీటీ టూరింగ్ డిజైన్‌తో రూపుదిద్దుకున్న ‘జీటీ3 ఆర్ఎస్’ ఆధారంగా పొర్చె 911 ఎస్/టీ కారు మార్కెట్లోకి వస్తున్నది. 4.0-లీటర్ల ఫెక్స్ సిక్స్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో అందుబాటులోకి వస్తున్నది. ఈ ఇంజిన్ గరిష్టంగా 518 హెచ్‌పీ విద్యుత్, 465 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. ఈ రేర్ వీల్ డ్రైవ్ కారు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ తో వస్తున్నది. డ్యుయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉంటుంది. ఇప్పటికే భారత్ మార్కెట్లో 911 మోడల్ కార్లు టర్బోఎస్, కార్రేరా, కార్రేరా టీ, జీటీ3 ఎస్3 తదితర కార్లు విక్రయిస్తున్నారు.