దామరచర్ల, అక్టోబర్ 3: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం పరిధిలో ఉన్న అంబుజా సిమెంట్ కర్మాగారంపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) చర్యలు చేపట్టింది. పీసీబీ అధికారులు గురువారం పరిశ్రమను తనిఖీ చేసి సిమెంట్ ఉత్పత్తిని నిలుపుదల చేయాలని అదేశాలు జారీ చేసినట్టు సమాచారం.
కాలుష్యం నియంత్రణలో అంబుజా సంస్థ సరైన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు పరిశ్రమపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ప్లాంట్‌కు డస్ట్ క్లీనర్ లేక పొగ గొట్టాల ద్వారా కాలుష్యం అధికంగా వస్తుండటంతో పరిశ్రమపై పీసీబీ చర్యలు తీసుకున్నట్టు చెప్తున్నారు.