Poco X6 Neo | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ (Xiaomi) సబ్ బ్రాండ్ పోకో (Poco) తన పోకో ఎక్స్6 నియో (Poco X6 Neo) ఫోన్‌ను వచ్చేనెలలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. నియో బ్రాండ్ కింద పోకో తీసుకువస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ ఇదే. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్వోసీ చిప్ సెట్, 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. పొకో ఎక్స్6 నియో (Poco X6 Neo) ఫోన్ ధర సుమారు రూ.15,000 లేదా అంతకంటే తక్కువ ధరకు లభిస్తుంది. 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
రెడ్మీ నోట్ 13ఆర్ పరో ఫోన్ రీబ్రాండెడ్ వర్షన్ ఫోన్ పోకో ఎక్స్6 నియో (Poco X6 Neo) అని చెబుతున్నారు. గత నెలలో చైనా మార్కెట్లో ఆవిష్కరించిన పోకో ఎక్స్6 నియో ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.23,000 (1999 చైనా యువాన్లు) పలుకుతుంది.
పోకో ఎక్స్6 నియో, రెడ్మీ నోట్ 13ఆర్ ప్రో ఫోన్లలో స్పెషిఫికేషన్లు ఒకేలా ఉంటాయి. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పల్స్ విడ్త్ మాడ్యులేషన్ (పీడబ్ల్యూఎం) డిమ్మింగ్తోపాటు రెడ్మీ నోట్ 13ఆర్ ప్రో ఫోన్ 6.67 అంగుళాల (1080×2400 పిక్సెల్స్) ఓలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6080 ఎస్వోసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 108- మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా విత్ 2-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాతో కూడిన డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది.