Poco X6 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ (Xiaomi) సబ్ బ్రాండ్ పోకో (Poco) తన పోకో ఎక్స్6 5జీ (Poco X6 5G) ఫోన్ లో కొత్త వేరియంట్ భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. గత నెలలో 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ, 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ ఆవిష్కరించిన పోకో (Poco).. తాజాగా 12 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చింది.
పోకో ఎక్స్6 (Poco X6 5G) ఫోన్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్2 ఎస్వోసీ (Snapdragon 7s Gen 2 SoC) చిప్ సెట్, 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5100 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటాయి. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. 64-మెగా పిక్సెల్ సెన్సర్ మెయిన్ కెమెరా, 8-మెగా పిక్సెల్ సెన్సర్ ఆల్ట్రా వైడ్, 2 -మెగా పిక్సెల్ మాక్రో సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటాయి. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్బ్రైట్ నెస్‌తో 6.67-అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే స్క్రీన్ విత్ 1.5 కే రిజొల్యూషన్ ఉంటుంది.
ఫ్లిప్ కార్ట్ ద్వారా పోకో తన పోకో ఎక్స్6 5జీ ఫోన్ విక్రయిస్తుంది. 12 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ ధర రూ.23,999గా నిర్ణయించారు. మిర్రర్ బ్లాక్, స్నో స్టోర్మ్ వైట్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ కార్డులపైనా, ఈఎంఐ ఆప్షన్లతో కొనుగోలు చేస్తే రూ.3000 డిస్కౌంట్ లభిస్తుంది.
పోకో ఎక్స్6 5జీ ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.21,999, 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.24,999లకు లభిస్తాయి. ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హైపర్ ఓఎస్ వర్షన్ (Android 14-based HyperOS) పై పని చేస్తాయి. మూడేండ్ల పాటు ఆండ్రాయిడ్ అప్ డేట్స్, నాలుగేండ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ లభిస్తాయి.