ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో (Poco) తన పోకో ఎం7 ప్రో 5జీ (Poco M7 Pro 5G) ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.13,999 పలుకుతుంది. అత్యంత అందుబాటు ధరలో ఉన్న స్మార్ట్ ఫోన్ ఇదే. 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ఆల్ట్రా ఎస్వోసీ, 45వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5110 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇందులో డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది.
పోకో ఎం7 ప్రో 5జీ (Poco M7 Pro 5G) ఫోన్ 6 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.13,999, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.15,999 పలుకుతుంది. ఆలివ్ ట్విలైట్, లావెండర్ ఫ్రాస్ట్, లునార్ డస్ట్ పవర్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ నెల 20 నుంచి ఫోన్ల అమ్మకాలు ప్రారంభం అవుతాయి.
2160 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేటు, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.67- అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లే కలిగి ఉంటది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ స్క్రీనింగ్ ఉంటుంది. 2100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ఆల్ట్రా ఎస్వోసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హైపర్ ఓఎస్ ఔటాఫ్ బాక్స్ వర్షన్‌పై పని చేస్తుంది. రెండేండ్ల పాటు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్, నాలుగేండ్లు సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తామని పోకో తెలిపింది. 50-మెగా పిక్సెల్ సోనీ ల్వెతియా ఎల్వైటీ 600 ప్రైమరీ సెన్సర్, 2-మెగా పిక్సెల్ మాక్రో సెన్సర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 20-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. సెక్యూరిటీ కోసం ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 5జీ, డ్యుయల్ బాండ్ వై-ఫై కనెక్టివిటీ కలిగి ఉంటుంది.