Poco M6 Plus | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో (Poco) తన పోకో ఎం6 ప్లస్ (Poco M6 Plus) ఫోన్ ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్ ద్వారా ఆవిష్కరించనున్న పోకో ఎం6 ప్లస్ (Poco M6 Plus) ఫోన్ ఆగస్టు ఒకటో తేదీన మార్కెట్లో లాంచ్ చేస్తారు. మరో ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్ వెబ్ సైట్లోనూ లిస్టయిన పోకో ఎం6 ప్లస్ ఫోన్ ధర రూ.14,999 పలుకుతుందని భావిస్తున్నారు. శక్తిమంతమైన ఫీచర్లతో వస్తున్న మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ఇది.
పోకో ఎం6 ప్లస్ (Poco M6 Plus) ఫోన్ 240 టచ్ శాంప్లింగ్ రేట్, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.79 అంగుళాల కలర్ ఎల్సీడీ స్క్రీన్ విత్ 16 మిలియన్ కలర్స్ తో వస్తోంది. ఈ ఫోన్ స్క్రీన్ 1080×2460 పిక్సెల్స్ రిజొల్యూషన్ తో వస్తోంది. 850 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటుంది. పోకో ఎం6 ప్లస్ 5జీ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 అడ్వాన్స్డ్ ఎడిషన్ విత్ 2.2 గిగా హెర్ట్జ్ ఒక్టాకోర్ ప్రాసెసర్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హైపర్ ఓఎస్ కస్టమ్ యూఐ వర్షన్ పై పని చేస్తుంది. బెటర్ గేమింగ్, మల్టీ మీడియా ఎక్స్ పీరియన్స్ కోసం అడ్రెనో జీపీయూతో గ్రాఫిక్స్ హ్యాండిల్ చేయబడతాయి. ఈ ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కలిగి ఉంటుంది. హైబ్రీడ్ స్లాట్ ద్వారా ఒక టిగా బైట్ వరకూ స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవచ్చు. 2.4 గిగాహెర్ట్జ్ నుంచి 5గిగా హెర్ట్జ్ డ్యుయల్ బాండ్ వై-ఫై, బ్లూటూత్ వీ5.0, యూఎస్బీ -సీ విత్ యూఎస్బీ ఆన్ ది గో, ఐఆర్ బ్లాస్టర్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. హై క్వాలిటీ వాయిస్ కాల్స్ కోసం ఓల్ట్ తోపాటు జీపీఆర్ఎస్, ఎడ్జ్, 3జీ, 4జీ, 5జీ నెట్ వర్క్‌కు మద్దతుగా ఉంటుంది.
108 మెగా పిక్సెల్ పీడీఏఎఫ్ ఎఫ్/1.8 వైడ్ యాంగిల్ లెన్స్, 2-మెగా పిక్సెల్ ఎఫ్/2జ4 మాక్రో లెన్స్ విత్ ఆటో ఫోకస్ కెమెరాలు ఉంటాయి. ఫోటో, పోర్ట్రైట్, నైట్, వీడియో, 50ఎంపీ మోడ్, టైం ల్యాప్స్ తదితర మోడ్స్ లో కెమెరా సిస్టమ్ పని చేస్తుంది. ఈది 1080పీ @ 30 ఎఫపీఎస్ ఫుల్ హెచ్డీ రికార్డింగ్ కెపాసిటీ వస్తుంది. ఇక సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 13- మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది.
జీపీఎస్ విత్ ఏజీపీఎస్, గ్లోనాస్, బైదూ మద్దతుగా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేష్ అన్ లాక్ ఫీచర్‌తోపాటు యాక్సెలరోమీటర్, ఎలక్ట్రానిక్ కంపాస్, ఐఆర్ బ్లాస్టర్ వంటి సెన్సర్లు ఉన్నాయి. పోకో ఎం6 ప్లస్ 5జీ ఫోన్ 33వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5030 ఎంఏహెచ్ కెపాసిటీ గల నాన్ రిమూవబుల్ లి-పో బ్యాటరీతో వస్తోంది.
August Bank Holidays | ఆగస్టులో 13 రోజులూ బ్యాంకులకు సెలవులు.. కారణమిదే..!