న్యూఢిల్లీ, జూన్ 3 : పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ).. విద్యాలక్ష్మి స్కీం కింద విద్యా రుణాలు తీసుకునేవారికి వడ్డీరేటును 20 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. విద్యా రుణాలు తీసుకునేవారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలనే ఉద్దేశంతో బ్యాంక్ ఈ ప్రత్యేక స్కీంను తీసుకొచ్చింది.
దేశవ్యాప్తంగా 860కి పైగా ఉన్నత ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్‌లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు రుణాలు ఇవ్వనున్నట్లు బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. 7.5 శాతం వార్షిక వడ్డీతో విద్యా రుణాలు మంజూరు చేస్తున్నది.