పీఎన్బీ ఎఫ్డీలపై మరింత వడ్డీ
రిజర్వ్‌బ్యాంక్ రెపో రేటును పెంచిన నేపథ్యంలో శనివారం ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఎఫ్డీలపై మరింత వడ్డీ ఇస్తున్నట్టు ప్రకటించింది.
న్యూఢిల్లీ, మే 7: రిజర్వ్‌బ్యాంక్ రెపో రేటును పెంచిన నేపథ్యంలో శనివారం ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఎఫ్డీలపై మరింత వడ్డీ ఇస్తున్నట్టు ప్రకటించింది. కొన్ని కాలపరిమితుల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 60 బేసిస్ పాయింట్ల వరకూ పీఎన్బీ పెంచింది.
రేట్ల పెంపు మే 7 నుంచి వర్తిస్తుందని తెలిపింది. రూ.2 కోట్ల లోపు దేశీ టెర్మ్ డిపాజిట్లపై రేట్లను 10-20 బేసిస్ పాయింట్లు పెంచగా, రూ. 2 నుంచి రూ. 10 కోట్ల డిపాజిట్లపై ఆయా కాలపరిమితుల్నిబట్టి 60 బేసిస్ పాయింట్ల (0.6 శాతం) వరకూ అధికంగా వడ్డీ ఆఫర్ చేస్తున్నట్టు పీఎన్బీ తెలిపింది.
30 రోజుల నుంచి 45 కాలపరిమితులుగల ఎఫ్డీలపై 60 బేసిస్ పాయింట్లు, 271 రోజుల నుంచి 1 ఏడాది పరిమితిగల ఎఫ్డీలపై 50 బేసిస్ పాయింట్లు పెంచింది. మిగిలిన కాలపరిమితులు గల అన్ని డిపాజిట్ల రేట్లలో మార్పులేదని పీఎన్బీ తెలిపింది. ఇక రెపో లింక్డ్ లెండింగ్ రేటును (ఆర్ఎల్ఎల్ఆర్) 6.90 శాతానికి పీఎన్బీ పెంచింది. ఈ బ్యాంక్ వెబ్సైట్లో పొందుపర్చిన సమాచారం ప్రకారం సవరించిన ఆర్ఎల్ఎల్ఆర్ కొత్త కస్టమర్లకు తక్షణమే అమలులోకి రాగా, ప్రస్తుత ఖాతాదారులకు జూన్ 1 నుంచి వర్తిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

