‘ఒక్క ఫోన్ కాల్‌తో ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్నే ఆపేసినట్టు ప్రచారం చేసుకొన్న వారికి.. అమెరికా సుంకాల నుంచి భారత్‌ను రక్షించడం సాధ్యంకాలేదా? విశ్వగురువు దౌత్యం ఈ విషయంలో ఫెయిల్ అయ్యిందా??’.. భారత్‌పై అమెరికా టారిఫ్ యుద్ధాన్ని ప్రకటించడం ఆలస్యం.. సోషల్‌మీడియాలో సర్వత్రా జరుగుతున్న చర్చ ఇది. మూలాల్లోకి వెళ్తే.. ఈ ప్రశ్న నిజమేననిపిస్తున్నది కూడా..!
Trump Tariffs | హైదరాబాద్, ఏప్రిల్ 3 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): టారిఫ్‌ల విషయంలో అమెరికాతో ప్రధాని నరేంద్ర మోదీ దౌత్యం ఫెయిల్ అయ్యిందని, అందుకనే భారత్‌పై సుంకాల మోత మోగించిందని సర్వత్రా చర్చ జరుగుతున్నది. ఇటీవలి పరిణామాలను విశ్లేషిస్తే ఇది నిజమేనని అర్థమవుతున్నది. సుంకాల వల్ల భారత్‌కు ఏటా 7 బిలియన్ డాలర్ల వరకు నష్టం వాటిల్లవచ్చని బ్లూంబర్గ్ అంచనా.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తొలిసారిగా పగ్గాలు చేపట్టినప్పుడు మోదీకి ఆయనకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ క్రమంలోనే ‘హౌదీ మోదీ’, ‘నమస్తే ట్రంప్’ పేరిట అటు అమెరికాలో ఇటు భారత్‌లో పెద్దయెత్తున కార్యక్రమాలు జరిగాయి. ఇరు దేశాధినేతలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు కూడా. అయితే, అనంతరం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయి బైడెన్ అధ్యక్షుడిగా గెలిచారు. ఉపాధ్యక్షురాలైన కమలా హారిస్‌పై మోదీ పలుమార్లు ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే, ట్రంప్‌ను కలువబోనంటూ ఓ ఇంటర్వ్యూలోనూ వ్యాఖ్యానించారు. ఇదే చెడిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
గత నెలలో అమెరికాలో పర్యటించిన మోదీ.. భారత్‌పై అమెరికా టారిఫ్‌ల అంశాన్ని ట్రంప్‌తో ప్రస్తావించడానికి ప్రయత్నించారు. అయితే, మోదీని వారించిన ట్రంప్.. టారిఫ్‌ల విషయంలో ఎవరికీ మినహాయింపులేదని తెగేసి చెప్పారు. అమెరికా దిగుమతులపై భారత్ అత్యధిక సుంకాలు విధిస్తున్నదని, తాము కూడా అలాగే వ్యవహరిస్తామని తేల్చిచెప్పారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ హడావిడిగా అమెరికాకు బయల్దేరినా ఫలితం లేకపోయింది.
అమెరికా నుంచి దిగుమతి అయ్యే లగ్జరీ మోటర్ వాహనాలపై 20 శాతం మేర, బోర్బన్ విస్కీపై విధిస్తున్న టారిఫ్‌లను 50 శాతం మేర భారత్ తగ్గించింది. అమెరికాకు చెందిన గూగుల్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే యాడ్స్‌పై విధించే 6 శాతం పన్నును రద్దు చేసింది కూడా. అయినప్పటికీ పని జరగలేదు.