న్యూఢిల్లీ, అక్టోబర్ 23: వాణిజ్య ఒప్పందంపై భారత్-అమెరికా దేశాల మధ్య జరుగుతున్న చర్చలు పురోగతి దిశగా సాగుతున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. సమీప భవిష్యత్తులో న్యాయమైన, ఒప్పందం కోసం కృషి చేస్తున్నట్టు ఆయన చెప్పారు.
వాణిజ్య కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ నేతృత్వంలోని భారత టీం గతవారంలో అమెరికా బయలుదేరి వెళ్లింది. అమెరికా వాణిజ్య శాఖ ఉన్నతాధికారులతో చర్చలు జరిపింది. మూడు రోజులపాటు సాగిన ఈ చర్చలు ఈ నెల 17న ముగిశాయి. దేశీయ ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం టారిఫ్‌ను విధించారు.