Google Pixel 6A | సెర్చింజన్ `గూగుల్ (Google) కీలక నిర్ణయం తీసుకున్నది. గ్లోబల్ మార్కెట్‌తోపాటు భారత్‌లో పిక్సెల్ 7ఏ.. 5జీ స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించిన గూగుల్.. ఆ కొద్ది సేపటికే పిక్సెల్ 6ఏ ఫోన్ ధర భారీగా తగ్గించింది. కాలిఫోర్నియాలో బుధవారం మొదలైన గూగుల్ ఐ/ఓ కాన్ఫరెన్స్‌లో ఈ నిర్ణయం తీసుకున్నది. గూగుల్ పిక్సెల్ 7ఏ ఫోన్ ఈ-కామర్స్ జెయింట్ ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేసుకోవచ్చు. పిక్సెల్ 7ఏ ఆవిష్కరించిన వెంటనే గూగుల్ పిక్సెల్ 6ఏ ఫోన్ ధర రూ.16 వేలు తగ్గించింది. వాస్తవంగా పిక్సెల్6ఏ ఫోన్ ధర రూ.43,999 కాగా, ఫ్లిప్ కార్ట్‌లో బుక్ చేసుకున్న వారికి రూ.27,999లకే లభిస్తుంది. పిక్సెల్ 6ఏ ఫోన్ అభిమానులంతా ఎంతో కాలంగా ధర తగ్గింపు కోసం ఎదురు చూస్తున్నారు.
6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ పిక్సెల్ 6ఏను గతేడాది గూగుల్.. భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఇది మిడ్ రేంజ్ బెస్ట్ స్మార్ట్ ఫోన్లలో ఒకటిగా భావించవచ్చు. మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం 2022 తృతీయ త్రైమాసికంలో కోటికి పైగా పిక్సెల్ 6ఏ ఫోన్ అమ్ముడైంది. మార్కెట్లోని అత్యంత పాపులర్ స్మార్ట్ ఫోన్లలో ఇది ఒకటిగా మారింది.
గూగుల్ పిక్సెల్ 6ఏ ఫోన్ 6.1-అంగుళాల డిస్ ప్లే, 4410 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 18 వాట్ల వైర్డ్ చార్జింగ్‌తో పని చేస్తుంది. మార్కెట్లోకి ఆవిష్కరించినప్పుడు ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేసినా, తర్వాత ఆండ్రాయిడ్ 13 వర్షన్ అప్‌గ్రేడ్ చేశారు. చాక్, చార్కోల్, సాగే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
పిక్సెల్ 6ఏ ఫోన్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. 12.2-మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 12 మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, సెల్ఫీల కోసం ఫ్రంట్‌లో 8-మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది.