హైదరాబాద్, నవంబర్ 10: అతిపెద్ద ఇంజినీరింగ్ సేవల సంస్థ పిట్టీ ఇంజినీరింగ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ నికర లాభం రూ.10.16 కోట్ల నుంచి రూ.22.55 కోట్లకు చేరుకున్నట్టు తెలిపింది.
పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభంలో 121.95 శాతం పెరిగింది. ఆదాయం మాత్రం రూ.304.54 కోట్ల నుంచి రూ.302 కోట్లకు పడిపోయింది. అలాగే ఏప్రిల్-సెప్టెంబర్ మధ్యకాలంలో రూ. 593.56 కోట్ల ఆదాయంపై రూ.36.52 కోట్ల లాభాన్ని గడించింది.