న్యూఢిల్లీ, జూలై 26: మూడు చక్రాల వాహన తయారీ సంస్థ పియాజియో..దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఈ-ఆటోను అందుబాటులోకి తీసుకొచ్చింది. రెండు రకాల్లో లభించనున్న ఈ వాహనం ప్రారంభ ధర రూ.3. 30 లక్షలు కాగా, గరిష్ఠంగా రూ.3. 88 లక్షలుగా నిర్ణయించింది. దీంట్లో 7.5 కిలోవాట్ల బ్యాటరీతో తయారైన యాప్ ఈ-సిటీ ఎఫ్ఎక్స్ మాడల్ సింగిల్ చార్జింగ్‌తో 174 కిలోమీటర్లు ప్రయాణించనుండగా, అలాగే యాప్ ఈ-సిటీ మాడల్ సింగిల్ చార్జింగ్‌తో 236 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. ఈ సందర్భంగా కంపెనీ చైర్మన్ డియాగో గ్రాఫీ మాట్లాడుతూ.. కొత్తధనం కోరుతున్న వారికి ఈ ఆటో సరైనదని, దీనిపై ఐదేండ్లు లేదా 2.25 లక్షల కిలోమీటర్ల వరకు వ్యారెంటీ కల్పిస్తున్నట్టు చెప్పారు.