PhonePe | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20 : ఫోన్‌పే కూడా స్టాక్ మార్కెట్లో లిస్ట్కావడానికి సిద్ధమవుతున్నది. ప్రస్తుతం కంపెనీ విలువ 12 బిలియన్ డాలర్లు. దేశీయ మార్కెట్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న ఈ విదేశీ సంస్థ వెనుకుండి సేవలు అందిస్తున్న ఫోన్‌పే.. దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టి పదేండ్లు పూర్తైన సందర్భంగా ఎక్సేంజ్‌ల్లో అడుగుపెట్టడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
ఐపీవో సన్నాహాల్లో భాగంగా ఫోన్‌పే 2022 డిసెంబర్లోనే తన హోల్డింగ్ కంపెనీని సింగపూర్ నుంచి భారత్‌కు తరలించింది. ఇందుకోసం రూ.8 వేల కోట్లు పన్ను రూపంలో చెల్లించింది. ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో 48 శాతం వాటాతో ఫోన్‌పే అగ్రస్థానంలో ఉన్నది. గూగుల్‌పే 37 శాతం వాటాతో రెండో స్థానంలో కొనసాగుతన్నది.