PhonePe | ప్రస్తుతం ప్రతి ఒక్కరూ డిజిటల్ పేమెంట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. డిజిటల్ పేమెంట్స్ యాప్స్ వచ్చాక పేమెంట్స్ తేలికయ్యాయి. మన వద్ద నగదు లేకున్నా ఆన్ లైన్ లో చెల్లింపులు చేసేయొచ్చు. ఈ యాప్స్ సాయంతో ఆర్థిక లావాదేవీలు మాత్రమే కాదు.. తక్షణ అవసరాలు తీర్చుకునేందుకు రుణాలు కూడా పొందొచ్చు. మీరు ఫోన్ పే వాడుతున్నారా.. అయితే ప్రస్తుతం ఫోన్ పే నుంచి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు నిమిషాల్లో లోన్ పొందొచ్చు. పోన్ పే తన యూజర్ల కోసం ఈ కొత్త సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది.
ఇప్పటి వరకూ వ్యక్తిగత రుణాలు మాత్రమే అందించిన ఫోన్ పే ద్వారా మ్యూచువల్ ఫండ్స్ మీద, బంగారం రునాలు, బైక్ రుణాలు, కార్ల లోన్లు, ఇల్లు, ఎడ్యుకేషన్ లోన్లు తీసుకోవచ్చు. అంతే కాదు ఆస్తి తనఖా పెట్టి రుణం పొందొచ్చు. ఇందుకోసం బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఫిన్ టెక్ కంపెనీలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్నది ఫోన్ పే. టాటా క్యాపిటల్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, హీరో ఫిన్ కార్ప్, ముత్తూట్ ఫిన్ కార్ప్, డీఎంఐ హౌసింగ్ ఫైనాన్స్, హోం ఫస్ట్ ఫైనాన్స్, రూపే, వోల్ట్ మనీ, గ్రేడ్ రైట్ వంటి సంస్థలతో ఫోన్ పే ఒప్పందాలు చేసుకున్నది. నిబంధనలకు అనుగుణంగా ఆన్లైన్లో నిమిషాల వ్యవధిలో రూ.5 లక్షల వరకూ రుణాలు తేలిగ్గా పొందవచ్చు.