న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: ఫార్మాస్యూటికల్ కంపెనీ విరూపాక్ష ఆర్గానిక్స్..స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నది. ఇందుకోసం మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకున్నది. రూ.740 కోట్ల నిధులను తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయడం ద్వారా సేకరించాలనుకుంటున్నట్లు పేర్కొంది. దీంట్లో రూ.360 కోట్ల నిధులను వ్యాపార విస్తరణకోసం, రూ.195 కోట్లను రుణాలను తీర్చడానికి ఇతర అవసరాల నిమిత్తం వినియోగించనున్నట్టు ప్రకటించింది.
కంపెనీకి హైదరాబాద్లో నాలుగు ప్లాంట్లు ఉండగా, రెండు కర్ణాటకలో ఉన్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.811 కోట్ల ఆదాయంపై రూ.78 కోట్ల పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభాన్ని గడించింది.