హైదరాబాద్, మే 23: ఫార్మా సంస్థ దివీస్ ల్యాబ్ అంచనాలకుమించి రాణించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.751 కోట్ల నికర లాభాన్ని గడించింది. కిందటేడాది నమోదైన లాభంతో పోలిస్తే 13 శాతం వృద్ధి కనబరిచింది. కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 9.5 శాతం ఎగబాకి రూ.2,831 కోట్లకు చేరుకున్నది. మరోవైపు, గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.30 తుది డివిడెండ్‌ను ప్రకటించింది.