బెంగళూరు, డిసెంబర్ 17: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ కెనరా బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించింది. ఆర్బీఐ రెపో రేటు కోత నేపథ్యంలో ఆ ప్రయోజనాన్ని తమ ఖాతాదారులకు అందిస్తూ రెపో ఆధారిత వడ్డీరేటును 8.25 శాతం నుంచి 8 శాతానికి బ్యాంక్ కుదించింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నది.
తగ్గిన వడ్డీరేట్లు ఈ నెల 12 నుంచే అమల్లోకి వస్తాయని కూడా బ్యాంక్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో బ్యాంక్ రుణగ్రహీతలపై ఈఎంఐల భారం తగ్గుతుంది. రుణ కాలపరిమితి కూడా దిగొస్తుంది.