Paytm | న్యూఢిల్లీ, ఆగస్టు 26: పేటీఎం బ్రాండ్‌తో ఆర్థిక సేవలు అందిస్తున్న వన్97 కమ్యూనికేషన్స్ ఎండీ, సీఈవో విజయ శేఖర్ శర్మకు మార్కెట్ నియంత్రణ మండలి సెబీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మార్చి 2024లో స్టాక్ ఆప్షన్ కింద షేర్ల కేటాయింపునకు సంబంధించి ఈ నోటీసులు జారీ చేసినట్లు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది.
2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను ఎంప్లాయి స్టాక్ ఆప్షన్ కింద 2.1 కోట్ల షేర్లను శర్మకు కేటాయించినట్లు గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను విడుదల చేసిన వార్షిక నివేదికలో వెల్లడించింది.