Zomato | న్యూఢిల్లీ, ఆగస్టు 21: పేటీఎం..తనకున్న ఎంటర్టైన్మెంట్ టికెటింగ్ వ్యా పారాన్ని జొమాటోకు విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. ఒప్పందం విలువ రూ. 2,048 కోట్లు. ఎంటర్టైన్మెంట్లో భాగంగా పేటీఎం యాప్ కింద సినిమా టికెట్లతోపాటు స్పోర్ట్స్, ఈవెంట్లకు సంబంధించిన అన్ని రకాల టికెట్లను విక్రయిస్తున్నది. ఎంటర్టైన్మెంట్ టికెటింగ్ వ్యాపారాన్ని జొమాటో లిమిటెడ్‌కు విక్రయిస్తున్నట్లు వన్ 97 కమ్యూనికేషన్స్ బుధవారం ప్రకటించింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 21: దేశీయ కార్పొరేట్లు ఉద్యోగుల నియమాకాలను భారీ స్థాయిలో తగ్గించుకున్నాయి. 2022-23లో 5.7 శాతం వృద్ధితో నియామకాలు చేపట్టిన కార్పొరేట్ సంస్థలు.. ఆ మరుసటి ఏడాది 1.5 శాతానికి తగ్గించుకున్నాయని బీవోబీ వెల్లడించింది. రిటైలింగ్, ట్రేడింగ్, మౌ లిక, రియల్టీ, రంగాల్లో పెరిగినప్పటికీ..ఆతిథ్య, లాజిస్టిక్స్, బిజినెస్ సర్వీసెస్, టెక్స్టైల్ రంగాల్లో తగ్గుముఖం పట్టాయని పేర్కొంది.