PayTM IPO | ఫిన్టెక్ సంస్థ పేటీఎం ఐపీవో తేదీ ఖరారైంది. దాని స్క్రిప్ట్ ధర కూడా నిర్ధారించారు. వచ్చేనెల 8వ తేదీన ఐపీవో సబ్స్క్రిప్షన్ ప్రారంభం కానున్నదని పేటీఎం పేరెంట్ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. సబ్ స్క్రిప్షన్ ప్రారంభ ధర రూ.2080-2150 ఉండొచ్చునని తెలిపింది.
దీంతో సంస్థ విలువ రూ.1.44 లక్షల కోట్ల నుంచి రూ.1.48 లక్షల కోట్ల మధ్య ఉంటుంది. పేటీఎం ఐపీవో వచ్చేనెల 10 ముగియనున్నది. ఐపీవో ద్వారా రూ.18,300 కోట్ల నిధులు సేకరించాలని పేటీఎం లక్ష్యం.ఇందులో ఫ్రెష్ ఈక్విటీ ఇవ్వడం ద్వారా రూ.8,300 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా రూ.10 వేల కోట్ల నిధులు సేకరించనున్నది.
ఓఎఫ్ఎస్ ద్వారా పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ రూ.402.65 కోట్లు, ఆంట్ఫిన్ (నెదర్లాండ్స్) ద్వారా రూ 4704.43 కోట్లు, ఆలీబాబా సంస్థ ద్వారా రూ.784.82 కోట్లు, ఎలివేషన్ క్యాపిటల్ నుంచి రూ.75.02 కోట్ల విలువైన షేర్లను విక్రయించి, నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది పేటీఎం.