ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం సీఈవో విజయ్‌శేఖర్ శర్మ ఫుల్ జోష్‌లో ఉన్నారు. త్వరలో స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కోసం ఐపీవోకు వెళ్లనున్న పేటీఎం ఐపీవోకు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ (సెబీ) శుక్రవారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. రూ.16,600 కోట్ల నిధుల సేకరణ లక్ష్యంతో పేటీఎం ఈ ఐపీవోకు వెళుతున్నది.
Scenes at Paytm office after SEBI approves one of India’s largest IPOs 😀😀@vijayshekhar pic.twitter.com/6yQHKVBm39
— Harsh Goenka (@hvgoenka) October 24, 2021
తమ ఐపీవోకు సెబీ అనుమతి లభించడంతో విజయ్‌శేఖర్ శర్మ ఆనందంతో ఉబ్బి తబ్బిబవుతున్నారు. సెబీ అనుమతి రాగానే.. సిబ్బందితో కలిసి తన కార్యాలయం వద్ద డ్యాన్స్ వేశారు. పేరొందిన బాలీవుడ్ సింగర్ కిశోర్ కుమార్ ఆలాపించిన అప్నీ తో జైసీ టేస్ట్ అనే గేయానికి విజయ్‌శేఖర్ శర్మ స్టెప్పులేశారు.
దీనికి సంబంధించిన వీడియోను ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా ట్వీట్ చేశారు. పేటీఎం ఐపీవోకు సెబీ అనుమతితో పేటీఎం కార్యాలయంలో ఉన్న పండుగ వాతావరణానికి నిదర్శనం అని కూడా కామెంట్ చేశారు. దీపావళి పర్వదినం తర్వాత పేటీఎం ఐపీవో మార్కెట్‌ను తాకే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.